60 శాతం పూర్తయిన "కొంచెం ఇష్టం-కొంచెం కష్టం"
సిద్ధార్థ్, తమన్నా నాయికా నాయికలుగా నల్లమలుపు బుజ్జి నిర్మిస్తోన్న చిత్రం "కొంచెం ఇష్టం-కొంచెం కష్టం". వి.వి.వినాయక్ అసిస్టెంట్‌గా, భగీరథ చిత్ర కథకుడుగా పనిచేసిన కిషోర్ డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు నానక్ రామ్ గూడాలో జరుగుతోందని చెప్పారు.
ఆ తర్వాత పొల్లాచ్చిలో టాకీతో పాటు పాటల చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో నవంబర్ 30 వరకు షూటింగ్ పూర్తవుతుందని నల్లమలుపు బుజ్జి చెప్పారు. ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు.
ఫ్యామిలీ ఎమోషనల్‌తో అందమైన ప్రేమకథగా ఈ సినిమాను తీర్చిదిద్దామని వెల్లడించారు. తొలిసారిగా ఈ చిత్రాన్ని సూపర్ 35లో డి.ఎ. చేస్తున్నామని, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ముగించుకుని సంక్రాతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా... వి.జె. చక్రవర్తి (బొమ్మరిల్లు), సంగీతం... శంకర్ కిషన్ రాయ్ (దిల్ చాహ్‌తాహై).