19న ప్రారంభమవుతున్న సుశాంత్ "కరెంట్"
అక్కినేని నాగేశ్వరరావు మనుమడు సుశాంత్ హీరోగా నటించిన తొలిచిత్రం "కాళిదాసు". అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా సుశాంత్‌తో నాగసుశీల ద్వితీయ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
స్నేహఉల్లాల్ కథానాయికగా నటించే ఈ చిత్రానికి "కరెంట్" అనే పేరును ఖరారు చేశారు. డి. సురేష్ బాబు చిత్రాలకు పనిచేసి, ఆర్య, బొమ్మరిల్లు చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన సూర్యప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19న ఉదయం 8 గంటలకు అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రారంభమవుతుందమని నిర్మాతలు తెలిపారు. విభిన్నమైన కథాంశంతో నిర్మాణమయ్యే ఈ చిత్రం సుశాంత్ కెరీర్‌కి గొప్ప టర్నింగ్ పాయింట్ కానుందని వారు వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం... దేవీశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ... విజయ్ సి. కుమార్, ఎడిటింగ్... మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్... కణల్ కన్నన్, ఆర్ట్... నారాయణ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... సూర్యప్రతాప్.