వైజాగ్‌లో ప్రభాస్ బిల్లా!
ప్రభాస్ హీరోగా, అనుష్క, నమిత హీరోయిన్లుగా తమిళ "బిల్లా" సినిమా... తెలుగులో అదే పేరిట రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. తమిళంలో అజిత్, నయనతార నటించిన "బిల్లా" చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు.
తెలుగులో గోపికృష్ణమూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు, కంత్రీ ఫేమ్ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వ పగ్గాలు చేపడుతున్నారు. ప్రబోధ్, నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయదశమి సందర్భంగా సెట్‌పైకి వచ్చిన ఈ సినిమా... ఈ నెల 20 నుంచి 27వరకు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకోనుంది. ఈ చిత్రీకరణలో భాగంగా ప్రభాస్, అనుష్కలపై ఓ పాటను షూట్ చేయడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఇంకా మలేషియా, బ్యాంకాంక్, దుబాయ్‌లలో షూటింగ్ జరుపుకోనున్నప్రభాస్ "బిల్లా"కు అత్యున్నత ప్రమాణాలను చేకూర్చే దిశగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం.