1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నవంబరులో "కృష్ణం వందే జగద్గురుం"

వినోదం వెండితెర కథనాలు విక్టరీ వెంకటేష్ కృష్ణం వందే జగద్గురుం సినిమా నవంబరు సెట్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న "కృష్ణం వందే జగద్గురుం" సినిమా నవంబరులో సెట్‌పైకి రానుంది. అల్లరి నరేష్, కమలిని ముఖర్జీ జంటగా నటించిన "గమ్యం" సినిమాకు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ (క్రిష్) వెంకీ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

స్ర్కిఫ్ట్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. భారీ అంచనాలతో చిత్రీకరించనున్న "కృష్ణం వందే జగద్గురుం" చిత్రాన్ని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శక నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారని సినీ వర్గాలు కోడైకూస్తున్నాయి.

ఇకపోతే... విక్టరీ వెంకీ, అనుష్క, మమతా మోహన్ దాస్‌ హీరోహీరోయిన్లుగా నటించి తాజాగా తెరకెక్కిన "చింతకాయల రవి" థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
About Writer
SELVI.M