"కవి"త్వంలో చిన్న పొరబాటు దొర్లితే...
|
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జూబ్లీహిల్స్‌లోని ఓ భవంతిలో జరుగుతోంది. ఏవీఎస్, దువ్వాసి మోహన్, రఘునాధరెడ్డి, దేవీశ్రీ తదితరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ... కవిత్వంలో దొర్లిన పొరబాటు వల్ల ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయ ప్రయాణమే సినిమా ఇతివృత్తమన్నారు. కొత్తవారైనప్పటికీ సికిందర్, ప్రతిష్ట చక్కగా నటిస్తున్నారని, ఏడు పాటలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు.
నిర్మాత రామ్మోహన్ మాట్లాడుతూ... ఈ చిత్రం తొలి షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుందని, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుగుతోందని చెప్పారు. ఈ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుందన్నారు. తర్వాత పాటలను అరకు, వైజాగ్, బ్యాంకాక్‌లలో చిత్రీకరించనున్నామని తెలిపారు.
నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతాయని వెల్లడించారు. ఏవీఎస్ మాట్లాడుతూ... పెద్ద హీరోలు లేని చిత్రమైనా మంచి కథాబలమున్న చిత్రమిదన్నారు.
ఇంకా ఈ చిత్రానికి కెమెరా... ఇ.ప్రసాద్, సంగీతం... ఎం.వి.కె. మల్లిక్, పాటలు... సురేందర్, జగదీష్, సమర్పణ... సి.హెచ్.హరిశంకర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... జితేంద్ర.