24 నుంచి ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ చిత్రం
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) సమర్పణలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 12 వరకు తొలి షెడ్యూల్ జరుగుతుంది.
ఈ షెడ్యూల్ వివరాల్ని నిర్మాత వల్లభనేని వంశీమోహన్ తెలియజేస్తూ... ఈ నెల 24 నుంచి 28వరకు చిత్రంలోని చైల్డ్ ఎపిసోడ్ తీస్తామన్నారు. 29 నుంచి నాలుగోతేదీ వరకు హీరో ఎన్టీఆర్‌పై ఇంట్రడక్షన్ ఫైట్‌ని భారీ ఎత్తున చిత్రీకరించబోతున్నామని చెప్పారు. నవంబర్ నుంచి 12 వరకు రామోజీ ఫిలింసిటిలో నిర్మిస్తున్న భారీ సెట్‌లో ఓ పాటను షూట్ చేస్తామని వల్లభనేని వెల్లడించారు. ఎన్టీఆర్ సరసన ఓ హీరోయిన్ ఇలియానా కాగా, మరో హీరోయిన్ కోసం ఎంపిక జరుగుతోందన్నారు.
ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి చెబుతూ... వినయ్ దర్శకత్వంలో సినిమా అంటే తనకు ఏమాత్రం టెన్షన్ ఉండదని, అన్నీ తను చక్కగా చూసుకుంటాడని చెప్పారు. ఆది, సాంబ తర్వాత వినయ్‌తో చేస్తున్న మూడో సినిమా ఇదని వెల్లడించారు. అలాగే వంశీతో చేసే మొదటి సినిమా ఇదని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవకుండా చాలా పెద్ద హిట్ తియ్యాలన్న పట్టుదలతో వీరిద్దరున్నారన్నారు.
అంచనాలకు ధీటుగా... తప్పకుండా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకునే రీతిలో అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని ఎన్టీఆర్ తెలిపారు. తన కెరీర్‌రో మరో సెన్సేషనల్ మూవీగా ఈ సినిమా అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో ఆది, సాంబ తర్వతా చేస్తున్న సినిమా ఇదని, కచ్చితంగా తమ కాంబినేషన్‌కు హ్యాట్రిక్ అవుతుందన్నారు. నానిగారితో తనకు ఇది రెండో సినిమా అని, అలాగే తన మిత్రుడు వంశీ ఈ సినిమాతో నిర్మాత అవుతున్నాడని వెల్లడించారు. ఎన్టీఆర్, తను కలిసి చేస్తున్నామంటే... ఆడియన్స్, ఫ్యాన్స్ అంచనాలను అనుగుణంగా చాలా హై లెవల్‌లో ఈ సినిమా ఉంటుందన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లామర్ స్టార్ ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కథ, మాటలు... కోన వెంకట్, సంగీతం... దేవీశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ... ఛోటా కె.నాయుడు, ఫైట్స్... స్టన్ శివ, ఆర్ట్... ఆనంద్ సాయి. ఎడిటింగ్... గౌతం రాజు, కో-ఆర్డినేటర్... తోట రామకృష్ణ, కో-డైరక్టర్... పుల్లారావు కొప్సినీడి, ప్రొడక్షన్ కంట్రోలర్.. జి.వి.కె. రాజు. సమర్పణ... కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని), నిర్మాత... వల్లభనేని వంశీ మోహన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం... వి.వి.వినాయక్.