1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సుశాంత్ "కరెంట్" ప్రారంభం

వినోదం వెండితెర కథనాలు సుశాంత్ కరెంట్ అన్నపూర్ణ స్టూడియో స్నేహఉల్లాల్ శ్రీనాగ్ కార్పొరేషన్  శ్రీనివాస్
WD
అక్కినేని నాగేశ్వరరావు మనుమడు (కూతురు నాగ సుశీలకుమారుడు) సుశాంత్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రం "కరెంట్". ఈ సినిమా షూటింగ్ అభిమానుల కోలాహలం మధ్య అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం నాడు ప్రారంభమైంది. "ఉల్లాసంగా... ఉత్సాహంగా..." ఫేం స్నేహఉల్లాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో, శ్రీనాగ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల సంయుక్తంగా నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. నా పేరులో "యస్" ఉంది. నీ పేరులో "యస్" ఉంది. ఇద్దరం కలిస్తే సక్సెసే అని హీరోయిన్‌తో హీరో అనే సన్నివేశాన్ని ముహూర్తపు షాట్‌గా చిత్రీకరించారు. దీనికి నాగార్జున క్లాప్ ఇవ్వగా అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. వెంకట్ అక్కినేని గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం నాగార్జున మాట్లాడుతూ... ప్రేక్షకులు అక్కినేని కుటుంబాన్ని ఆదిరిస్తున్నారని, ఇదే కోవలో సుశాంత్‌ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు.

అక్కినేని నాగేశ్వర రావు స్పందిస్తూ... అభిమానులు పిచ్చి పనులు చేయకుండా మంచి ప్రవర్తన, నడవడికతో ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులొచ్చారని, జనరేటర్‌తో పనిలేదని, మీ నుంచే కరెంట్ పుడుతుందని చమత్కరించారు.

అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రముంటుందని, సుశాంత్ తన తొలి చిత్రం "కాళిదాసు"లో ఐదు సినిమాలు చేసిన యాక్టర్‌లా నటించాడని, ఈ సినిమాతో అగ్రహీరోల సరసన చేరతాడని నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు అన్నారు.

తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, కొండవలస, షఫీ, సుధ, తెలంగాణా శకుంతల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... దేవీశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ... విజయ్ సి. కుమార్, ఎడిటింగ్... మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్... నారాయణ రెడ్డి, ఫైట్స్... కణల్ కణ్ణన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... సూర్యప్రతాప్.
About Writer
SELVI.M