1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తేజ "కేక"కు "యు" సర్టిఫికేట్

వినోదం వెండితెర కథనాలు ప్రముఖ దర్శకుడు తేజ కేక  సెన్సార్ పచ్చజెండా యు సర్టిఫికేట్ 36మంది కొత్త ఆర్టిస్టులు
ప్రముఖ దర్శకుడు తేజ రూపొందిస్తున్న తాజా చిత్రం "కేక". ఈ సినిమాకు సెన్సార్ పచ్చజెండా ఊపుతూ యు సర్టిఫికేట్‌ ఇచ్చింది. ప్రతి చిత్రంలో కొత్తదనం చొప్పించే తేజ "కేక" సినిమాను కూడా విభిన్న కథాంశంతో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో దాదాపు 36 మందిని కొత్త ఆర్టిస్టులుగా వెండితెరకు పరిచయం చేయనున్నారు.

జయం, చిత్రం, ఒక విచిత్రం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన తేజ... వీధిబాలల నేపథ్యంలో "కేక" సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ సింగిల్ డైలాగ్‌‌ను మాత్రమే సెన్సార్ బోర్డు కట్ చేయించిందని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 23న (గురువారం) ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఈ చిత్రానికి సంగీతం, ఫోటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
About Writer
SELVI.M