1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"దేవర కొండయ్య" ఆడియో విడుదల

వినోదం వెండితెర కథనాలు స్నేహచిత్ర పిక్చర్స్ పతాకం ఆర్ నారాయణ మూర్తి దేవర కొండయ్య ఆడియో విడుదల దేవర కొండ నాగరాజు
WD
స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణ మూర్తి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "దేవర కొండయ్య". ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌ ప్రివ్యూథియేటర్‌లో జరిగింది. ముఖ్య అతిథి నాయి బ్రాహ్మణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు దేవర కొండ నాగరాజు ఆడియో సీడీని ఆవిష్కరించి, ప్రజాకవి వంగ పండు ప్రసాదరావుకు అందించారు. అనంతరం ఆడియో కేసెట్‌ను నాయూ బ్రాహ్మణ నగర కార్యదర్శి ఎం.విద్యాసాగర్ విడుదల చేయగా గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ... ఈ చిత్రం టైటిల్‌ను దేవరకొండ నాగరాజు అని పెడదాం అనుకున్నామని, కానీ ఆ పేరు పెడితే ఆయన కుటుంబ కథ తీయాల్సి వస్తుందని దేవర కొండ వీరయ్య అని పెట్టామన్నారు.

ఇందులో సన్నాయి విద్వాంసునిగా నటించానని, తన పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆరాటపడుతుంటే, తండ్రిని చూడకుండా, కొడుకు విదేశాల్లో ఉంటాడు.

కూతురుపై మమకారంతో గొప్ప చదువు చెప్పించే ఆశలో పెంచితే విద్యాలయాల్లోని దుర్మార్గుల చేతిలో కూతురు బలైతే ఆయన ఎలాంటి ఆవేదనకు గురైయ్యాడనే పాయింట్‌ను ఇతివృత్తంగా తీసుకుని కథను మలిచామని వెల్లడించారు. నాయి బ్రాహ్మణుల జీవితం కళ్లకు కట్టినట్లుగా ఉంటుందని చెప్పారు.

సంఘ అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు మాట్లాడుతూ... మానవుని జీవితంలో అవినాభావ సంబంధమున్న వృత్తిని నాయీ బ్రాహ్మణులు నిర్వర్తిస్తారని, మనిషి పుట్టుక నుంచి అన్ని కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించే నాయీ బ్రాహ్మణుల సమస్యలను ఇతివృత్తంగా తీస్తున్న నారాయణ మూర్తిక్తి కృతజ్ఞతలు తెలియజేస్తుకుంటున్నానన్నారు.

ఎక్కడో ఉన్న మమ్మల్ని ప్రజల ముందుకు తెచ్చిన ఆర్. నారాయణ మూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వంగపండు ప్రసాద రావు, జయరాజ్ అన్నారు. ఇందులో కొడుకుపై రాసిన ఓ పాటను తాను పాడానని సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పేర్కొన్నారు.
About Writer
SELVI.M