"బిల్లా"కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా తెరమీదకు వచ్చాడు ప్రభాస్. హీరోగా ఎత్తూ, ఫిజిక్ ఉండి తనదైన శైలిలో టాలీవుడ్‌లో నిలదొక్కుకున్నాడు. చేసింది తక్కువ చిత్రాలైనా ప్రేక్షకుల మదిలో మాస్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. పెద్దనాన్న ఇమేజ్ సినిమాల్లో విజిటింగ్ కార్డ్‌గానే పనికివస్తుందనే నిజాన్ని గ్రహించిన ప్రభాస్... తొలిచిత్రం "ఈశ్వర్"తోనే తన కృషి పట్టుదల ఏపాటిదో నిరూపించుకున్నాడు.
తొలి చిత్రంతోనే అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను ఆకట్టుకుని తన కెరీర్‌కు బలమైన పునాది వేసుకున్నాడు. అయితే తను ఆశించినంతగా కెరీర్ ముందుకు సాగకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని కథల ఎంపిక పట్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ కోవలోనే పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్వంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ బేనర్‌పై కృష్ణంరాజుతో కలిసి "బిల్లా" చిత్రం చేస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన "బిల్లా" ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి "కంత్రి" రూపకర్త మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడంతో పాటు గోపీకృష్ణామూవీస్ అనగానే ఇప్పటికే అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈశ్వర్, యోగి, మున్నా, ఛత్రపతి వంటి యాక్షన్ చిత్రాలకు ప్రాధాన్యత నిచ్చిన ప్రభాస్ ఈసారి పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన యాక్షన్ చిత్రం చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. విజయదశమి నాడు లాంఛనంగా శ్రీకారం చుట్టిన "బిల్లా" చిత్రం... ప్రభాస్ పుట్టిన రోజైన (ఈ నెల 23న గురువారం) మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిద్దాం.