దాసరి నారాయణరావు ఆస్పత్రి పాలు
ప్రముఖ దర్శకుడు, రాజకీయ వేత్త దాసరి నారాయణరావు ఆస్పత్రి పాలైయ్యారు. నాలుగు రోజుల క్రితం కిడ్నీ సమస్యతో దాసరి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. ఏషియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో దర్శకరత్న చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు.
ఇటీవల విష్ణు నిశ్చితార్థంలో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహితుడైన దాసరి లేకపోవడాన్ని, అదే వేడుకకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి గుర్తించారు.
అనంతరం ఆయన గురించి వాకబు చేయగా, దాసరి ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన దాసరిని వైఎస్సార్ అనంతరం పరామర్శించారు. అయితే మనం కూడా దాసరి త్వరలో కోలుకోవాలని ఆశిద్దామా...?