1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

విడుదలకు సిద్ధమైన "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"

వినోదం వెండితెర కథనాలు శివాజీ కావేరీ ఝా జంట నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ నాగేంద్ర కుమార్ దర్శకత్వం
శివాజీ, కావేరీ ఝా జంటగా నటించే చిత్రం "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్". ఎం. నాగేంద్ర కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ప్రేయసి కోసం డబ్బును సులభ మార్గంలో సంపాదించి రిచ్ కావాలనుకునే వ్యక్తి కథని ఇదని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ కాన్సెప్ట్‌కు కాస్త కామెడీని మిళితం చేసి తెరెకెక్కిస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

కమర్షియల్ పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుందని కుమార్ తెలిపారు. నవంబర్ మొదటి వారంలో చిత్ర ఆడియోను విడుదల చేయనున్నామన్నారు.

"మంత్ర" ఫేమ్ ఆనంద్ సమకూర్చిన బాణీలు శ్రోతలను ఆకట్టుకుంటాయని కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్, ఐశ్వర్య, విజయ్ సాయి, కమల్, బబ్లూ తదితరులు నటిస్తున్నారు.
About Writer
SELVI.M