కన్యాశుల్కాలు వద్దనే "మిష్టర్ గిరీశం"
ఆనాడు కన్యాశుల్కం వద్దనేందుకు గిరీశం ప్రయత్నిస్తే... ఈనాటి గిరీశం భవిష్యత్తులో కన్యాశుల్కం రాకుండా ఏం చేయాలో? చెబుతున్నాడని "మిష్టర్ గిరీశం" చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ అన్నారు. ఎస్.ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై కృష్ణభగవాన్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రమేష్ చంద్ర బెనర్జీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సోమవారం నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ఆరంభం కానున్నాయని చెప్పారు. విజయదశమినాడు విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని, త్వరలో ప్లాటినంకు చేరువవుతామన్నారు. ఇందులో ప్రతి పాత్రకు గుర్తింపు లభిస్తుందని, చిత్రాన్ని నవంబర్ మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ... ఇది ఈనాటి పరిస్థితుల కన్యాశుల్కమని, రానురాను మహిళల శాతం తగ్గిపోతుందని, హత్యలు, ఆత్మహత్యలు, బలవన్మరణాలు, శిశుహత్యలు ఎక్కువయ్యాయన్నారు. భవిష్యత్‌లో పురుషుల శాతం ఎక్కువై... కన్యాశుల్కం వస్తే ఎటువంటి పరిస్థితులు వస్తాయని, అవి రాకుండా ఈనాటి గిరీశం ఏం చేస్తున్నాడనేది చిత్ర ఇతివృత్తమన్నారు.
నటుడు సందేశ్ మాట్లాడుతూ... రషెన్ చూశాక సినిమాపై మరింత నమ్మకం ఏర్పడిందని, ఖుద్దూస్ చక్కని బాణీలు సమకూర్చాడని చెప్పారు. ఇందులో ఎన్.ఆర్.ఐ లుబ్దావధానులుగా నటిస్తున్నానని వెల్లడించారు.
ఈ చిత్రానికి కెమెరా... రాజేష్ కాటా, మాటలు... కొర్నిపాటి వేణు భార్గవ్, సమర్పణ...గెలివి మురళీమోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. విశ్వప్రసాద్.