1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మార్కెట్‌లో ''హ్యాపీ జర్నీ'' పాటలు

మెగాస్టార్ చిరంజీవి హీరో హీరోయిన్లు హ్యీపీ జర్నీ మార్కెట్ ఆడియా పాటలు సంగీతం విశ్వతేజ హీరో
FileWD


మెగాస్టార్ మేనల్లుడు విశ్వతేజ కథానాయకుడిగా మధుశాలిని హీరోయిన్‌గా నటించిన చిత్రం 'హ్యాపీజర్నీ'. ఈ చిత్రం పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఓం నమఃశివాయ క్రియేషన్స్ పతాకంపై కెవి.రెమణారెడ్డి నిర్మించారు. సభాపతి దర్శకత్వం వహించారు. నందన్ రాజ్ సంగీతం సమకూర్చగా, సుప్రీం ఆడియో సంస్థ ఈ చిత్రం పాటలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

WD

పాటల క్యాసెట్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటుడు నాగబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆడియోసీడీని విడుదల చేసి మరో అతిథి రమణ గోకులకు అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. మా మేనమామగారి అబ్బాయి ఈ చిత్ర కథానాయకుడు. అసలు పేరు రాహుల్. స్క్రీన్ పేరు విశ్వతేజ. చాలాకాలంగా హీరో కావాలని కలలు కంటున్నాడు. ఆ కోరిక ఇప్పటికి తీరింది. చిత్ర పరిశ్రమలో తామంతా ఉన్నా.. తామ సాయం కోరకుండానే స్వయంగా ఎదిగారు. మంచి కథతో రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

WD
అనంతరం చలపతిరావు మాట్లాడుతూ.. వయస్సులో ఉండగా సంపాదనే ధ్యేయంగా ఉంటూ సంసార జీవితంపై సరైనశ్రద్ధ పెట్టక, ఆనక ముసలితనంలో తమ జర్నీని ఒక్కసారి పరిశీలిస్తే ఏం కోల్పోయామో తెలుస్తుంది. ఆ వేషం.. నేను వేశాను. చక్కని కుటుంబ విలువలు కలిగిన చిత్రమని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ.. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అయితే వారి జీవితంలో ఏర్పడిన సంఘటనల సమూహారమే ఈ చిత్ర ఇతివృత్తం.

దర్శకుడు సభాపతి చక్కగా తెరకెక్కించాడు. కొత్తవాడయినా విశ్వతేజ బాగా చేశాడని చెప్పారు. నందన్‌రాజ్ తొలిసారిగా ఈ చిత్రానికి ఆకట్టుకునే బాణీలు సమకూర్చారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.ఎన్.ఆదిత్య, రమణ గోకుల, శివాజీ రాజా, కవిత తదితరులు పాల్గొన్నారు.
About Writer
PNR