మాజీ ప్రపంచ సుందరికి యుక్తాకు పెళ్లికళ
మాజీ ప్రపంచసుందరి, బాలీవుడ్ నటి యుక్తాముఖి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రిన్స్ తులిని ఆమె వివాహమాడనున్నారు. ఈ వివాహం ఆదివారం అంగరంగ వైభవంగా జరుగనుంది. తులి కుటుంబం భారత్‌తో పాటు విదేశాల్లో హోటల్, రవాణా, ఇంధన, ఆటోమొబైల్ రంగాల్లో వ్యాపార ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ప్రిన్స్ తులి ఢిల్లీలోని తమ వ్యాపారాలు చూసుకుంటున్నారు.
హోటర్ తులి ఇంటర్నేషనల్‌కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం నాగ్‌పూర్‌లో యుక్తా-తులి నిశ్చితార్థం జరిగినట్లు పెళ్లికుమారుడి బంధువు, కాంగ్రెస్ నేత మొహబ్బత్‌సింగ్ తులి చెప్పారు. మెహందీ కార్యక్రమంతో మొదలయ్యే వివాహ మహోత్సవ వేడుకలు ఐదు రోజుల వేడుకగా సాగుతాయని చెప్పారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలిపారు.