అభద్రతాభావంలో భోజ్‌పురి చిత్రపరిశ్రమ
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు సృష్టిస్తున్న వీరంగం వల్ల భోజ్‌పురి చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతోంది. దీంతో ముంబై నుంచి శాశ్వతంగా వీడి పోవాలని ఈ పరిశ్రమ భావిస్తోంది. భోజ్‌పురి చిత్రపరిశ్రమ ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం చేస్తోంది. ఏడాదికి 75 చిత్రాలను నిర్మిస్తున్న ఈ సంస్థ.. 250 మిలియన్ల అభిమాలను ఆలరిస్తోంది.
అంతేకాకుండా ఈ చిత్ర పరిశ్రమలో వందలాది మంది అన్‌స్కిల్డ్, సెమీ-స్కిల్ట్ వర్కర్లు పని చేస్తున్నారు. అలాగే వివిధ విభాగాల్లో మరికొందరు పూర్తిస్థాయి టెక్నీషియన్స్ విధులు నిర్వహిస్తున్నారు. మరో యాభై మంది పేరొందిన కళాకారులకు ముంబైలో శాశ్వత నివాసాలు ఉన్నాయి. వీరంతా.. వేరే రాష్ట్రానికి తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు.
దీనిపై భోజ్‌పురి సూపర్ స్టార్, నిర్మాత మనోజ్ తివారీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో చిత్రపరిశ్రమను నెలకొల్పేందుకు ఆ రాష్ట్ర కల్చరల్ శాఖామంత్రి సుభాష్ పాండే ద్వారా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. అలాగే మరికొన్ని ఢిల్లీ, నోయిడా, పాట్నా వంటి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
చిత్రపరిశ్రమను ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌కు బదలాయించడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ముంబైలో భయభ్రాంతులతో నివశిస్తున్నాం. ఔట్‌డోర్ షూటింగ్ సమయాల్లోదాడులు ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేసేందుకు వెనుకాడబోరని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇక్కడ తమకు భద్రత లేదని మనోజ్ అభిప్రాయపడ్డారు.