చపాతీలో వంకాయకూర వేసుకుంటే...
|
బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయి పండు, ఆరెంజ్, క్యారెట్ వంటి పండ్లను కడుపారా ఆరగిస్తానంటోంది. మధ్యాహ్న భోజనంలో చపాతీలకే అధిక ప్రాధాన్యతనిస్తాంటోంది. చపాతీలో వంకాయ కూర వేసుకుంటే... ఓహ్ ఆ రుచి చెప్పేకంటే తిని చూడాల్సిందేనంటోదీ ముద్దుగుమ్మ.
సహజంగా రాత్రి వేళ డిన్నర్‌లో కాస్తంత తక్కువ ఆహారం తీసుకోమంటారు వైద్యులు. అయితే సోహా మాత్రం కనీసం రోజుమార్చి రోజైనా చికెన్ స్వాహా చేయందే ఉండలేనంటోంది. చికెన్‌తో వళ్లు చేస్తావేమో అని ఎవరైనా అంటే... "నా బాడీ చాలా పర్‌ఫెక్ట్. అంత తేలిగ్గా నేను ఒళ్లు చేయను.
ఒకవేళ నాకు ఇష్టమైనవి నేను ఆరగించలేదో... రివటలా సన్నగా తయారైపోతా. అందుకనే మా మమ్మీ నాకు సాయంత్రం భోజనంలో ఏమేం కావాలో ఫోను చేసి మరీ అడిగి తెలుసుకుంటుంది" అని చెప్పుకొచ్చింది అందాల సోహా. "ఎంత అదృష్టం... ఇష్టం వచ్చింది.. ఇష్టం వచ్చినంత తినడానికీ రాత ఉండాలి మరి" అని సోహ సహ నటీమణులు ఆమె తిండిని చూసి అసూయపడుతుంటారట.