టాక్సీ డ్రైవర్‌గా "యువరాజు"
|
రామోజీ ఫిలిం సిటిలో షూటింగ్ ప్రారంభించి రెండు రోజుల పాటు ఈ సినిమాను చిత్రీకరిస్తారు. అనంతరం భారీ షెడ్యూల్ కోసం యూనిట్ రాజస్థాన్ బయలుదేరుతుంది. 60 రోజుల పాటు అక్కడే ఏకధాటిగా జరిగే షూటింగ్‌కు అనంతరం, జనవరి 22 నుంచి కేరళలోని పొల్లాచ్చిలో పల్లెటూరుకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. తదనంతరం షూటింగ్‌ను దక్షిణాఫ్రికాలోని నమీబియాలో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తారని యూనిట్ వర్గాల సమాచారం.
ఈ సాంగ్‌కు రాజు సుందరం నృత్య దర్శకత్వం వహిస్తారు. తిరిగి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ చిత్ర పాటలను చిత్రీకరిస్తారు. రెండు పాటలకు బాలీవుడ్ డాన్స్ మాస్టర్స్ సరోజ్ ఖాన్, వైభవ్ మర్చంట్ కంపోజ్ చేస్తారు. మొత్తానికి ప్రిన్స్ చిత్రాన్ని ఎడ్వెంచరస్ కామెడీ యాక్షన్ చిత్రంగా మలుస్తున్నారని సమాచారం. కనకరత్నా మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ.. సునీల్ పటేల్.