"ద్రోణ" లోగో ఆవిష్కరణ
|
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర వివరాలు తెలియజేస్తూ... కథలో అత్యంత కీలక సన్నివేశాల చిత్రీకరణకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కర్నాటకలో గోఖర్ణ సమీపంలోని అరేబియా సముద్రంలోని ఓ దీవిలో సెట్ వేశామని, దీనికోసం రోజు 23 బోట్లలో వంద మంది కార్పెటర్లను తీసుకెళ్లామని చెప్పారు.
వైవిధ్యం కోసం రిస్క్ తీసుకుని ఇబ్బందులను అధికమించామని డి.ఎస్. రావు చెప్పారు. నితిన్ ఫ్లాష్‌బ్యాక్‌గా వచ్చే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త అనూభూతిని కలిగింపజేస్తుందని, ప్రముఖ ఐటం గర్ల్ రాఖీ సావంత్ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
"డాన్" ఫేం కెల్లీ జార్జ్ విలన్‌గా నటించారని, క్రిస్ట్‌మస్, సంక్రాంతి మధ్య చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు. అన్ని అంశాలతో చిత్రాన్ని మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు దర్శకుడు కరుణ్‌కుమార్ తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి ఫైట్స్.. సెల్వం, కెమెరా.. జి. కృష్ణ మురళి, మాటలు... హర్షవర్ధన్, సమర్పణ... డి. సరస్వతి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... జె.కరుణ కుమార్.