1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల చిత్రీకరణలో "కామెడీ ఎక్స్‌ప్రెస్"

వినోదం వెండితెర కథనాలు కౌషల్
WD
కౌషల్, ఆషాశైని హీరోహీరోయిన్లుగా టి.వి. మీడియా పతాకంపై శంకర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "కామెడీ ఎక్స్‌ప్రెస్". ఇప్పటికే టాకీని పూర్తయిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కస్తూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ... ప్రస్తుతం పాటలను చిత్రీకరిస్తున్నామని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని హాయిగా నవ్వించే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. నవంబర్ రెండో వారానికి పాటల చిత్రీకరణను పూర్తిచేసి డిసెంబర్ మూడో వారంలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

సత్యం, రాజేష్, శ్రీనివాస రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబూ మోహన్, సారిక రామచంద్రరావు, తడివేలు, అన్నపూర్ణ,. అను వైష్ణవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే, మాధవ్, పాటలు... పైడిపల్లి శ్రీనివాస్, ఎడిటింగ్... కె. రవీంద్రబాబు, కెమెరా... జయపాల్, సంగీతం... సామ్‌డికాస్టో.
About Writer
SELVI.M