1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సోషియో ఫాంటసీ చిత్రంగా "శబరి గిరీశా అయ్యప్ప"

వినోదం వెండితెర కథనాలు సోషియో ఫాంటసీ శబరి గిరీశా అయ్యప్ప శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్ పతాకం శివాజీ రాజా పూజారోషన్
WD
గతంలో సోషియో ఫాంటసీ కథాంశంతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. సంఖ్యాపరంగా అప్పటికంటే ఈ తరహా చిత్రాల నిర్మాణం మరింత అధికమైంది. ఇదే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న చిత్రం "శబరి గిరీశా అయ్యప్ప". శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో పి.వి. రమణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

శివాజీ రాజా, పూజారోషన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ నెల ఆరు నుంచి రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని, షూటింగ్ పార్ట్ పూర్తయ్యేంతవరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని దర్శక నిర్మాత పి.వి.రమణ వెల్లడించారు. హైదరాబాద్‌లోనే జరగబోయే ఈ షెడ్యూల్‌లో మిగతా టాకీతో పార్ట్‌తో పాటు చిత్రంలోని మూడు పాటలను చిత్రీకరించనున్నామని ఆయన తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... అయ్యప్ప మాలధారణ విలువను ఈ చిత్రంలో చూపించబోతున్నామన్నారు. అలాగే అయ్యప్ప 18 మెట్లు ఎక్కడానికి ఎలాంటి అర్హత కావాలనే అంశాన్ని కూడా చర్చిస్తున్నామని వెల్లడించారు. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రమిదని పి.వి. రమణ తెలిపారు.

కథానాయకుడు శివాజీ రాజా మాట్లాడుతూ... ఇలాంటి భక్తి చిత్రంలో తాను నటిస్తుండటం ఇదే మొదటిసారని చెప్పారు. ఇందులో దేవుణ్ణి నమ్మని హేతువాది పాత్రను పోషిస్తున్నానని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో... కృష్ణభగవాన్, రంగనాథ్, కె.కె.శర్మ, పృథ్వీ, మాస్టర్ విజయ్, దేవిశ్రీ, కొండవలస, వేణు తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా... కె. శివరామిరెడ్డి, సంగీతం... నాని, కూర్పు.. బాబు, కళ... విజయకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...చంద్రబాబు, సమర్పణ... బాలకోటేశ్వర రావు, నిర్మాత, దర్శకత్వం... పి.వి.రమణ.
About Writer
SELVI.M