1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సస్పెన్స్ థ్రిల్లర్‌గా "ఇందుమతి"

వినోదం వెండితెర కథనాలు సస్పెన్స్ థ్రిల్లర్ ఇందుమతి అందరూ దొంగలే హర్షారెడ్డి  శివాజీ శ్వేతాభరద్వాజ్ విజయ్ రఘుబాబు హర్షవర్ధన్
WD
గతంలో "అందరూ దొంగలే" చిత్రాన్ని అందించిన జియో మీడియా ఆర్ట్స్ అధినేత హర్షారెడ్డి తాజాగా స్వీయదర్శకత్వంలో "ఇందుమతి" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ, శ్వేతాభరద్వాజ్, విజయ్, రఘుబాబు, హర్షవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, గిరిబాబు, సత్యం రాజేష్, మేల్కొటి, కౌష తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ మాసాంతానికి "ఇందుమతి"ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హర్షారెడ్డి వెల్లడించారు. కథ, కథనాలు పరంగానే కాకుండా టెక్నికల్‌గా హైస్టాండర్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని హర్షారెడ్డి చెప్పారు.

ముఖ్యంగా కెమెరామెన్ వాసు, ఎడిటర్ శంకర్, సంగీత దర్శకుడు ఆనంద్ అందించిన సహాయ సహకారాలు ఈ చిత్రానికి ఎంతో ఉపయోగపడ్డాయని హర్షారెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన "ఇందుమతి" ఆడియో ఈ వారంలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత హర్షారెడ్డి వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి ఆర్ట్... నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. రఘునాథ రెడ్డి వారనాసి, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం.. హర్షారెడ్డి.
About Writer
SELVI.M