15 నుంచి వెంకీ "కృష్ణం వందే జగద్గురుం"..!
"గమ్యం" ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరక్షన్‌లో, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే "కృష్ణం వందే జగద్గురుం" చిత్రం ఈ నెల 15 నుంచి సెట్‌పైకి రానుంది. విజయశాంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించనున్నారు. ఇప్పటికే తెరపైకి వచ్చిన వెంకీ "చింతకాయల రవి" ప్రేక్షకుల మన్ననలు చూరగొంది.
తాజా చిత్రమైన "కృష్ణం వందే జగద్గురుం" కూడా భారీ బడ్జెట్‌తో చిత్రీకరణ జరుపుకుంటుందని యూనిట్ వర్గాల సమాచారం. పూర్తి వినోదాత్మక చిత్రంగా.. తెరపైకి రానున్న "కృష్ణం వందే జగద్గురుం" సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ఇకపోతే.. ఈ సినిమాకు ఇంకా హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే... "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.