1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఛార్మీని ప్రేమిస్తున్న దేవీశ్రీప్రసాద్..!

వినోదం వెండితెర కథనాలు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఛార్మీ ప్రేమ రాఖీ
WD
ప్రముఖ సంగీత దర్శకుడు "దేవీశ్రీ ప్రసాద్" అందాల భామ నటి "ఛార్మీ"ని ప్రేమిస్తున్నాడు..!. ఇప్పటికే వీరిద్దరిపై పలు కథనాలు సినీ వర్గాల్లో షికార్లు చేసిన సంగతి తెలిసిందే.

"రాఖీ" చిత్రం నుంచి వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, పబ్‌లలో, కొన్ని ఫంక్షన్‌లలో కలిసి హాజరయ్యారని ఫోటోలతో వార్తలొచ్చాయి.

వీటిని బట్టి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఇండస్ట్రీ భావించింది. అయితే... తామిద్దరం మంచి స్నేహితులమేనని దేవీశ్రీప్రసాద్ అప్పట్లో చెప్పారు. రియల్‌లైఫ్‌లో ఏమోగానీ... రీల్‌లైఫ్‌లో మాత్రం ఇద్దరు ప్రేమికులుగా నటిస్తున్నారు.

అంటే... ఇప్పటివరకు సంగీతదర్శకుడు, గాయకుడు, డాన్సర్‌గా ఉన్న దేవీశ్రీప్రసాద్ మొహానికి రంగువేసుకుని హీరోగా మారాడు. ఈ హీరో సరసన ఛార్మీ నటిస్తోంది. గతంలో "యమగోల మళ్లీ మొదలైంది" చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ వీరిద్దరి కాంబినేషన్‌లో తాజా సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 24న రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
About Writer
SELVI.M