1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రఘుబాబు ప్రధాన పాత్రలో "శివరాత్రి"

వినోదం వెండితెర కథనాలు రఘుబాబు ప్రధాన పాత్ర శివరాత్రి డిసెంబర్ 31 రాత్రి సింగం సుధాకర రెడ్డి
బి.ఎస్. విజువల్స్ అనే నూతన నిర్మాణ సంస్థ "శివరాత్రి" అనే సినిమాను నిర్మిస్తోంది. దీనికి "డిసెంబర్ 31 రాత్రి" అనే ట్యాగ్‌లైన్ కూడా జతచేసింది. సింగం సుధాకర రెడ్డి తన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రఘుబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో... ఆయనకు జోడీగా ప్రాచీ నటిస్తోంది. వీరిద్దరిపై బుధవారం రాక్ కాజిల్‌లో ముహూర్తపు షాట్ చిత్రించారు. దీనికి నటుడు రామిరెడ్డి క్లాప్ కొట్టగా, తమ్మారెడ్డి భరద్వాజ కెమేరా స్విచ్చాన్ చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ... డిసెంబర్ 31 రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు జరిగే కథే ఈ చిత్రమన్నారు. హారర్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సింగిల్ షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.

రఘుబాబు మాట్లాడుతూ... ఒక్క రాత్రిలో ఏం జరిగింది? అనే దాన్ని దర్శకుడు చక్కగా ఈ చిత్రం ద్వారా చెబుతున్నాడని వెల్లడించారు. హాస్యానికి పెద్ద పీట వేశారని చెప్పారు.

ప్రాచీ మాట్లాడుతూ... ఇదే బేనర్‌లో తనకిది రెండో చిత్రమని, వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నానని తెలిపారు.

సంగీత దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ఇందులో ఐదు పాటలున్నాయని, రీరికార్డింగ్ కూడా పూర్తయిందన్నారు.

ఇంకా ఈ చిత్రంలో కృష్ణభగవాన్, శివాజీ రాజా, సుమన్ శెట్టి, రామిరెడ్డి, జూ,రేలంగి, కొండవలస తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా... కె. శివరామ్‌రెడ్డి, ఎడిటింగ్... ఉత్తమరెడ్డి.
About Writer
SELVI.M