1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పోస్ట్‌ప్రొడక్షన్‌లో "దొంగల బండి"

వినోదం వెండితెర కథనాలు పోస్ట్ప్రొడక్షన్ దొంగల బండి జిఎస్కె నెట్వర్క్ పతాకం అల్లరి నరేష్
WD

జి.ఎస్.కె. నెట్‌వర్క్ పతాకంపై అల్లరి నరేష్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో జి.ఎస్.కె. నాయుడు నిర్మిస్తున్న చిత్రం "దొంగలబండి". ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ నెల మూడో వారంలో ఆడియోను, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు. అందరూ కమేడియన్స్‌తో నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందంచామని, నరేష్ సక్సెస్ గ్రాఫ్‌ని మరింత పెంచుతుందని నిర్మాత అన్నారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా... ఎస్. అరుణ్ కుమార్, సంగీతం... వల్లూరి రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు... సి.హెచ్.వి.శర్మ, గోరింట్ల లోకేష్ నాయుడు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... వేగేశ్న సతీష్.
About Writer
SELVI.M