1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నిర్మాణానంతర కార్యక్రమాల్లో "కుంభకోణం"

వినోదం వెండితెర కథనాలు నిర్మాణానంతర కార్యక్రమాలు కుంభకోణం సంజయ్ రాజ్ మోనికా చౌదరి మానస ఫిలింస్ రాజులపూడి కోటేశ్వరరావు
WD

సంజయ్ రాజ్, మోనికా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ "కుంభకోణం"ను తెలుగులో అదే పేరుతో మానస ఫిలింస్ అనువదిస్తోంది. రాజులపూడి కోటేశ్వరరావు సమర్పణలో వినాయక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సమాజంలో స్వార్థపరుల కుంభకోణాన్ని ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ ఏవిధంగా చేధించాడనే ఇతివృత్తం ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నిర్మాత తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగానీ, డిసెంబర్ మొదటి వారంలోగానీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సన్నాహాలు చేస్తున్నామని సహ నిర్మాతలైన లంకా రాజశేఖర్, సాధినేని శ్రీకాంత్‌లు చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రామిరెడ్డి, రఘునాథ రెడ్డి, కోట శంకరరావు, నరసింహరాజు, రవికిరణ్ తదితరులు నటించారు.

కథ, మాటలు.. శ్రీ కుమార్, పాటలు... సత్యముని, సంగీతం.. కిషన్ ఖావడియా, ఫైట్స్... రామన్, కెమెరా... కె. శ్రీనివాసరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... కె.ఎస్. ప్రసాద్.
About Writer
SELVI.M