1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నా మనసంతా కేరళపైనే... ? : అమితాబ్

వెండితెర కథనాలు బ్లాగ్ అభిషేక్ ఐశ్వర్యారాయ్ నా మనసంతా కేరళ అమితాబ్
FileWD
అనారోగ్య పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న అమితాబ్ మళ్లీ ఒత్తిళ్లకు గురవుతున్నారట. ఒత్తిళ్లకు దూరంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న తరుణంలో తనపై మళ్లీ మళ్లీ ఒత్తిళ్లు పడుతూనే ఉండడం బాగా ఆందోళన కల్గిస్తోందని అమితాబ్ ఆవేదన చెందుతున్నారు.

బాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన అమితాబ్‌ను అంతగా ఒత్తిడికి గురిచేస్తున్న ఆ అంశం ఏంటంటే... కేరళలోని అటవీ ప్రాంతంలో రావణ్ షూటింగ్‌లో సతీసమేతంగా పాల్గొంటున్న ఆయన ముద్దుల కొడుకు అభిషేక్ బచ్చన్ ఇటీవల చలీజ్వరం బారిన పడ్డాడట. దీంతో ముంబయిలో ఉన్న తన మనసంతా కేరళలోని కొడుకు యోగక్షేమాల గురించే ఆలోచిస్తోందని బిగ్‌బీ తాజాగా తన వ్యక్తిగత బ్లాగ్‌లో పేర్కొన్నారు.

బ్లాగ్‌లో వివరాల ప్రకారం అభిషేక్‌కు జ్వరం వచ్చిందనే సంగతి తన కోడలు ఐశ్వర్యారాయ్ ఫోన్ చేసి చెప్పడం వల్లే తనకు తెలిసిందని బిగ్‌బీ పేర్కొన్నారు. వెంటనే ఓ వైద్యుని చేత తన కొడుకు అభిషేక్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సూచనలు ఇప్పించినట్టు అమితాబ్ తన బ్లాగ్‌లో తెలిపారు.

మనిషి దేనినైనా తట్టుకోగలడు కానీ తన పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేడని ప్రస్తుతం తానూ అదే స్థితిలో ఉన్నానని ఈ సందర్భంగా అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
About Writer
Munibabu