ఎక్స్‌పోజింగ్ చేసీ చేసీ విసుగెత్తింది: బిపాస
|
ఈ మాజీ మోడల్ బాలీవుడ్‌లోకి అడుగు పెట్టినప్పటినుంచి వేడిక్కించి మరులు గొలిపించే తారగా, నటనా సామర్థ్యం లేనప్పటికీ సొగసైన ముఖారవిందంతో ఆకట్టుకుంటూ బండి లాగిస్తూ వచ్చింది. అయితే తన జగదేక సౌందర్యం కారణంగా దర్శకులు తన అవయవాల ప్రదర్శనను చిత్రీకరించడం మీదే దృష్టి పెట్టారు తప్ప తనలోని నటిని పూర్తి సామర్థ్యంతో వెలికి తీయలేకపోయారని బసు ఇప్పుడు బాధపడుతోంది.
ఇన్నాళ్లుగా మూస పాత్రల్లో అందమైన బొమ్మగా మాత్రమే తెరపై కన్పిస్తూ విసుగు చెందిన బిపాసా మంచి కథా ప్రాధాన్యం ఉన్న పాత్రలకోసం మొహ వాచేటట్లుగా వేచి ఉంటున్నానని పేర్కొంది.కేవలం హాట్ గర్ల్ నమూనాలో కన్పించి కనిపించి పరమ బోర్‌గా ఉంటోందని బిపాసా నిట్టూర్చింది. కవ్వించే జవ్వని పాత్రలు తనకు ఇష్టం లేదని చెప్పలేనని నిజానికి అలా ఉన్నానని అంటే దాన్ని అభినందనగానే స్వీకరిస్తానని చెప్పింది.
అయితే ప్రజలు ఎల్లవేళలా తన పాత్రలను సెక్సీతనంతోటే ముడిపెడుతున్నారని వాపోయింది. టీచర్ పాత్రలో నటిస్తే సెక్సీ టీచర్ అని, పోలీసు పాత్రల్లో నటిస్తే సెక్సీ కాప్ అని, గృహిణి పాత్రల్లో నటిస్తే సెక్సీ హౌస్‌వైఫ్ అని పిలుస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేసింది. దీనికి తానేమీ చేయలేనని, ఈ ఇమేజ్ నుంచి బయటపడాలని తాను భావించలేదని అయితే ఏ పాత్రలో నటించినా ఈ సెక్సీ విశేషణాలు తనను వదలడం లేదని ఆమె వాపోయింది.