1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"అనగనగా ఒక అరణ్యం"లో ఏం జరిగింది?

వినోదం వెండితెర కథనాలు అనగనగా ఒక అరణ్యం హ్యాపీ మూవీ క్రియేషన్స్ పతాకం కౌశల్ ఏక్తాత్రివేది శ్రీ రేఖ సైరాభాను
WD

హ్యాపీ మూవీ క్రియేషన్స్ పతాకంపై బెనజీర్ సమర్పణలో కౌశల్, ఏక్తాత్రివేది, శ్రీ రేఖ, సైరాభాను హీరోహీరోయిన్లుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో టి. సుల్తాన్ నిర్మిస్తున్న "అనగనగా ఒక అరణ్యం" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. హిందీలో ఈ సినిమాను హమ్ ఆప్ కే సాత్ హైగా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.... సూర్యుని కాంతికిరణాలపై పరిశోధనలు జరిపి సక్సెస్ సాధించిన శాస్త్రవేత్తల బృందం అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల ఒక అడవిలో చిక్కుకుంటారు. అందులో కొందరు మరణిస్తారు. అందులో హీరో అడవిలో సంచరిస్తూ... మరణకారణాన్ని శోధిస్తాడు. ఇదే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

ప్రేక్షకులను మైమరిపించే అనేక యాక్షన్ సన్నివేశాలతో, ఇప్పటికీ అనాగరికంగా బతుకుతున్న ఆటవిక జాతుల ఇతివృత్తాన్ని ఈ చిత్రంలో చూపడం జరిగిందని సుల్తాన్ తెలిపారు. వినూత్న కథను దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, ప్రస్తుతం టాకీ పూర్తయిందని చెప్పారు. క్లైమాక్స్ మాత్రం ముంబైలో హెలికాఫ్టర్ ఛేజింగ్‌ను చిత్రిస్తున్నామని, ఆడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు నిర్మాత అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... కథకు తగిన విధంగా ఎటువంటి లొకేషన్ అయినా నిర్మాత సహకరిస్తున్నారని, తమకూ బేనర్‌కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా.... సుధాకర్ రెడ్డి, సంగీతం... పాటలు... టీఎస్, ఫైట్స్ రవికాంత్, కథ. నిర్మాత.... టి సుల్తాన్, నిర్వహణ... హారున్ సమీర్.
About Writer
SELVI.M