"జగన్మోహిని" తల్లిగా జ్యోతిలక్ష్మి
రాజా, నమిత, మీరాచోప్రా నాయకా నాయకులుగా మురళి సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మిస్తోన్న చిత్రం "జగన్మోహిని". ఎస్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నమిత టైటిల్ పాత్రను పోషిస్తుండగా... ఆమె తల్లి పాత్రలో అలనాటి నాట్యతార జ్యోతిలక్ష్మి నటిస్తోంది.
నమిత-జ్యోతిలక్ష్మిలు సన్నివేశాల్లో నటించడమే కాకుండా ఓ నృత్యగీతంలో కూడా నర్తించడం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు వెల్లడించారు. విఠలాచార్య రూపొందించిన నాటు "జగన్మోహిని" చిత్రం స్ఫూర్తిగా, పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ... అండమాన్‌లో పదిహేను రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌లో రాజా, నమిత, మీరాచోప్రా, రియాజ్ ఖాన్, కోట తదితరులపై ఓ గీతాన్ని సన్నివేశాన్ని చిత్రీకరించామని చెప్పారు.
అండర్ వాటర్ సన్నివేశాలను గ్రాఫిక్స్ నిపుణులతో, విదేశీ నిపుణుల సమక్షంలో చిత్రించామని, అలాగే 40 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని రూపొందించి ప్రత్యేక సెట్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించామని నిర్మాత వెల్లడించారు.
ఈ సినిమాలో సీన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని, ఈ నెలలోనే హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. డిసెంబరులో పోస్ట్‌ప్రొడక్షన్స్ పూర్తి చేసి జనవరిలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
ఇంకా ఈ చిత్రానికి మాటలు, పాటలు.. వెన్నెలకంటి, సంగీతం... ఇళయరాజా, ఛాయాగ్రహణం, దర్శకత్వం.. ఎస్.కె.విశ్వనాథన్.