నాకు తీరని లోటు: బాలకృష్ణ
ప్రముఖ ఛాయాగ్రహకులు వి.ఎస్.ఆర్. స్వామి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటనిబాలకృష్ణ చెప్పారు. స్వామితో సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, వంటి ఎన్నో సినిమాలు చేశానని తమ కాంబినేషన్‌లో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయన్నారు.
ఓ హీరోకి, డైరక్టర్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో అలా టెక్నీషియన్‌గా స్వామికంటూ ఓ ప్రత్యేకత ఉందని, టైటిల్స్ మిస్ అయిన ప్రేక్షకులు కూడా మిస్ అయిన ప్రేక్షకులు కూడా సినిమా చూసేటప్పుడు "ఇది స్వామిగారి ఫోటోగ్రఫీ" అని గుర్తించి గొప్పగా చెప్పుకునేలా ప్రతి చిత్రంలోనూ తన ప్రత్యేకతను నిరూపించుకునేవారని బాలయ్య అన్నారు.
నాన్నగారితో (ఎన్టీఆర్)తో "దేవుడు చేసిన మనుషులు" వంటి భారీ చిత్రాలకు పనిచేయడంతో పాటు "ఎదురీత" వంటి మంచి చిత్రాన్ని స్వామి నిర్మించారని బాలయ్య గుర్తు చేశారు. ఆ తరం నుండి ఈ తరం వరకు గొప్ప టెక్నీషియన్‌గా పేరుపొందిన స్వామి లేని లోటు తీర్చరానిదని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలయ్య వెల్లడించారు.