బెనజీర్ భుట్టోగా సుస్మితా సేన్!
దివంగత పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పాత్రను సుస్మితా సేన్ పోషిస్తుందట. గత ఏడాది తీవ్రవాద దుశ్చర్యతో భుట్టో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భుట్టో జీవిత కాలం, ఆమె మరణంపై ఉర్దూ భాషలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో బెనజీర్ పాత్రలో నటించే అవకాశాన్నిబాలీవుడ్ భామ సుస్మితా కొట్టేసింది.
వోక్స్ విజన్, సన్ ఫిలిమ్స్ సంయుక్తంగా చిత్రీకరించనున్న ఈ సినిమా పాకిస్తాన్, ఇంగ్లండ్ దేశాల్లో చిత్రీకరించుకోనుంది. ప్రస్తుతం "రాణి లక్ష్మీ భాయ్" సినిమాలో బిజీబిజీగా ఉన్న సుస్మితా... "ఏక్ కిలాడి ఏక్ హసినా" అనే రియాల్టీ షోలోనూ పాల్గొంటుంది.
ఇకపోతే..."రాణి లక్ష్మీభాయ్"గా ప్రేక్షకులను అలరించనున్న సుస్మితకు బెనజీర్ భుట్టో పాత్రలో నటించే అరుదైన అవకాశం రావడంతో అమ్మడు తెగ సంబరపడిపోతుందట.!. దీనికోసం... భుట్టో జీవిత కాల విశేషాలకు సంబంధించిన పుస్తకాలను కూడా సుస్మితా తిరగేస్తుందట.