అర్థశతదినోత్సవంలో గోపిచంద్ "శౌర్యం"
|
ముందుగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని గోపీ చంద్ చెప్పారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆనందంగా ఉందని, మంచి లాభాలొస్తున్నాయని, ఓ మంచి సక్సెస్‌ఫుల్ డైరక్టర్ తెలుగు పరిశ్రమకు పరిచయమైనందుకు ఆనందగా ఉందని గోపిచంద్ అన్నారు.
శివ మాట్లాడుతూ... తొలి అవకాశం ఇచ్చిన గోపిచంద్‌కు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. గోపీచంద్ నటించిన చిత్రాలన్నింటిలోనూ భారీ బడ్జెట్ చిత్రమిదని, కొత్త దర్శకుడైనా ధైర్యంగా ముందుకొచ్చారన్నారు. అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన రవి సారథ్యంలో మరిన్ని క్వాలిటీ చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
సినిమా ఆడియో సభలో జరిగిన పాటలో తొలి క్యాసెట్‌ను దండమూడి బాలకృష్ణ 80వేల రూపాయలకు సొంతం చేసుకున్నారని, ఆ మొత్తాన్ని బి ఫార్మసీ చదువుతున్న పేద విద్యార్థిని రూబియా జబీన్ చదువు కోసం అందజేస్తున్నామన్నారు. అనంతం 80వేల రూపాయల చెక్కును రూబియాకు అందజేశారు.