1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమే: శోభారాణి

వినోదం వెండితెర కథనాలు ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమే శోభారాణి సూర్య హీరో  ఆస్కార్ రవిచంద్రన్
సూర్య హీరోగా ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రం ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని ఎస్.వి.ఆర్ మీడియా అధినేత వెల్లడించారు. "సూర్య సన్నాఫ్ కృష్ణన్" చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడదగ్గ సినిమాగా దర్శకుడు గౌతమ్ మీనన్ తీర్చిదిద్దారని ఆమె తెలిపారు.

ఇదిలా ఉండగా... ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. తెలుగు అనువాదాన్ని ఎస్.వి.ఆర్ మీడియా పతాకంపై శోభారాణి అందించారు. ఆదివారం నాడు జరిగిన సినిమా సక్సెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. అనుకున్నట్లే సినిమా గురించి మంచి టాక్ వచ్చిందన్నారు.

చిత్రానికి సాఫ్ట్ టైటిల్ పెట్టారేంటని చాలామంది అడిగారని, కానీ కథారీత్యా సరితూగే టైటిల్ ఇదని శోభారాణి చెప్పారు. సినిమాను చూసిన తర్వాత కృష్ణన్ లాంటి తండ్రి ఉండాలని ప్రతి కొడుకూ... సూర్య లాంటి కొడుకుండాలని ప్రతి తండ్రీ అనుకుంటారని శోభారాణి పేర్కొన్నారు.
About Writer
SELVI.M