సుప్రసిద్ధ కోలీవుడ్ ప్రతినాయకుడు "నంబియార్" మృతి
కోలీవుడ్ అలనాటి నటుడు ఎం.ఎన్. నంబియార్ చెన్నైలో బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు స్వగృహంలోనే మరణించినట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు.
దీంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తమిళ సినీ ప్రముఖులు చెన్నై గోపాలపురం నంబియార్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. 1935 సంవత్సరంలో సినీ రంగప్రవేశం చేసిన నంబియార్ విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నారు.
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ హీరోగా నటించిన పలు చిత్రాల్లో నంబియార్ ప్రతినాయకుడు పాత్రను పోషించారు. "ఎంగవీట్టు పిళ్లై", "కుడియిరుంద కోవిల్" వంటి పలు తమిళ హిట్ సినిమాల్లో నంబియార్ నటించారు. తమిళ సినీ పరిశ్రమలో రాటుదేలిన అలనాటి భయంకర విలన్ ఎవరంటే... ప్రేక్షకుల కళ్లముందు నిలబడే అద్భుతమైన నటుడు నంబియారే.
తన 13వ ఏటనే సినీరంగంలో అడుగుపెట్టిన నంబియార్... దాదాపు 1000 సినిమాల్లో నటించారు. 1919 సంవత్సరం మార్చి ఏడోతేదీ కేరళ రాష్ట్రంలోని మంజేరిలో ఆయన జన్మించారు. 1935లో తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న "భక్త రామదాసు" చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు నంబియార్ పరిచయమయ్యారు.
సినీ రంగంలో నంబియార్‌కు ప్రారంభం నుంచే విలన్ పాత్రలు మంచి గుర్తింపు సంపాదించిపెట్టాయి. ఆయన తను నటించిన అన్ని సినిమాల్లో ఒకే మూసలో నటించకుండా ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన నటనను నంబియార్ ప్రదర్శించేవారు. కోలీవుడ్ సినీపరిశ్రమలో అగ్రహీరోలుగా పేరుగాంచిన అలనాటి తారలు బాలయ్య, ఎంజీఆర్, శివాజీలతో మాత్రమే కాకుండా ప్రస్తుత యువహీరోలైన విజయ్, విక్రమ్‌లతో కూడా నంబియార్ నటించారు.
దాదాపు 7 తరాల నటులతో నంబియార్ నటించడం గమనార్హం. సినిమాల్లో విలన్‌గా కనిపించే నంబియార్... నిజ జీవితంలో హీరో. పరమ సాత్వికుడిగా అందరి మన్ననలను అందుకున్నారు. కార్తీకమాసంలో అయ్యప్పస్వామి దీక్షకై పవిత్రంగా మాల ధరించి, 41 రోజుల పాటు నిష్టనియమాలతో ఉపనాసముండి 65 సంవత్సరాలుగా శబరిమలై వెళ్లివస్తున్న నంబియార్‌కు మహా గురుస్వామి అనే పేరు కూడా ఉంది. కార్తీకమాసంలోనే ఆయన తుది శ్వాస విడవడం నిజంగా దైవ సంకల్పమేమో.