1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నా పెళ్లి దేవుని ఇష్టం : సల్మాన్ వేదాంతం

వినోదం వెండితెర కథనాలు బాలీవుడ్ కండల వీరుడు నా పెళ్లి దేవుని ఇష్టం  సల్మాన్ వేదాంతం
FileWD
బాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ఈ మధ్య వేదాంతం వల్లిస్తున్నాడు. ఎందుకంటే నీ పెళ్లెప్పుడు అని అడిగినవారికి సూటిగా సమాధానం చెప్పకుండా దేవుడు నిర్ణయించినపుడే తన పెళ్లి జరుగుతుందని వేదాంతి ధోరణిలో బదులిస్తున్నాడు మరి.

తన గర్లఫ్రెండ్ కత్రినా కైఫ్‌తో కలిసి నటించిన కొత్త చిత్రం యువ్‌రాజ్ ఈ నెల 21న విడుదల కానున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్‌తో కల్సి సల్మాన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సల్మాన్ పై విధంగా పేర్కొన్నాడు.

గత కొంతకాలంగా సల్మాన్‌కు కత్రినా కైఫ్‌కు మధ్య ఎఫైర్ నడుస్తున్నట్టు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరిద్దరు మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు బాలీవుడ్‌లో తాజాగా గుప్పుమన్నాయి.
FileWD


దీంతో అసలు విషయం తెలుసుకునేందుకే విలేకరులు పెళ్లెపుడంటూ సల్మాన్‌ను గడుసుగా కదిలించారు. అయితే ఇలాంటి ప్రశ్నలను ఇప్పటికే చాలాసార్లు విన్న సల్మాన్‌ కూడా వారికేమీ తీసిపోని రీతిలో సమాధానమివ్వడం విశేషం.
About Writer
Munibabu