1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మడోన్నా, గైరిచీల వివాహ బంధానికి పుల్‌స్టాఫ్

వినోదం వెండితెర కథనాలు బ్రిటన్ విడాకులు మడోన్నా
FileWD
ప్రముఖ పాప్ గాయని మడోన్నా, హాలీవుడ్ దర్శకుడు గైరిచీల ఎనిమిదేళ్ల వైవాహిక బంధం శుక్రవారంతో ముగింపుకొచ్చింది. దాంపత్య సుఖం కరువైందనే అసంతృప్తితో వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు కోర్టుకెక్కిన మడోనా, గైరిచీల జంటకు బ్రిటన్ కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఎనిమిదేళ్లపాటు కలిసి కాపురం చేసిన మడోనా, గైరిచీల మధ్య కొద్ది నెలలుగా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సన్నిహితులైనవారి వివరాల ప్రకారం 50 ఏళ్ల మడోనా ఎప్పుడూ తన దేహ ధారుడ్యం గురించి మాత్రమే ఆలోచిస్తూ భర్త గైరిచీని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది.

దీంతో భార్య దొరకాల్సిన అన్ని రకాల సుఖాలకు గైరిచీ దూరమయ్యాడు. అయినా సరే గైరిచీ కొన్నాళ్లపాటు ఓపిగ్గానే ఎదురుచూశాడు. అయితే మడోన్నా ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. అంతేకాదు తనకు భర్త కన్నా వ్యాయామశాలే ముఖ్యమని ఆమె తేల్చేసింది.


దీంతో చిరెత్తుకొచ్చిన గైరిచీ విడాకుల కోసం కోర్టుకెక్కారు. విడాకులకు వీరిద్దరూ సుముఖత వ్యక్తం చేయడంతో కోర్టు సైతం వీరి విడాకులను త్వరగానే మంజూరు చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో కాపరముంటోన్న ఈ జంటకు పెళ్లినాటికే రాకో అనే కుమారుడు ఉండడం విశేషం.

అలాగే మడోన్నా తన ఫిట్‌నెస్ గురువు కార్హోస్ లియాన్‌తో సాగించిన ప్రేమాయణం ద్వారా ఆమెకు మరో ఆడపిల్ల కూడా జన్మించింది. వీరిద్దరే కాకుండా మడోన్నా రెండేళ్ల క్రితం ఓ మగబిడ్డను మలావీ నుంచి దత్తత చేసుకుంది. ప్రస్తుతం గైరిచీ నుంచి విడిపోయిన మడోన్నా అమెరికా వెళ్లిపోవాలని ఆలోచిస్తోందని బ్రిటన్ పత్రికలు పేర్కొంటున్నాయి.

బ్రిటన్ కోర్టులో విడాకులు మంజూరయ్యే సమయానికి మడోన్నా, గైరిచీలు తమ కార్యకలాపాలతో బిజీ బిజీగా ఉండడం గమనార్హం. ఈ కారణంగానే మడోన్నా, గైరిచీలు కోర్టుకు హాజరుకాకుండానే విడాకుల ప్రక్రియ పూర్తయ్యింది. విడాకులు మంజూరయ్యే సమయానికి స్టిక్కీ అండ్ స్వీట్ అనే పేరుతో మడోన్నా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తుండగా మరోవైపు గైరిచీ ఓ హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించే పనిలో బిజీగా ఉన్నారు.
About Writer
Munibabu