1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రెంట్ తగ్గే వరకు టిక్కెట్ రేట్లను పెంచొద్దు: తమ్మారెడ్డి

వినోదం వెండితెర కథనాలు రెంట్ టిక్కెట్ రేట్లు పెంచొద్దు తమ్మారెడ్డి ఎగ్జిబిటర్లు థియేటర్స్
థియేటర్ల అద్దెను ఎగ్జిబిటర్లు తగ్గించే వరకూ టిక్కెట్ రేట్ల పెంపుదల జీవోను విడుదల చేయవద్దని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టిక్కెట్ రేట్లు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయని చెప్పారు.

రెండు వారాల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం రద్దు చేయమని అడిగినప్పుడే... "ఎ" క్లాస్‌కు చెందిన 10/15 సెంటర్లలో మాత్రమే 35 రూపాయల టెక్కెట్‌ను 50 రూపాయలకు పెంచమని అడిగామన్నారు. పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గత కొంతకాలం నుంచి తాము చేస్తున్న విజ్ఞప్తికి అనుగుణంగా ప్రభుత్వం స్పందించడం జరిగిందన్నారు. టిక్కెట్ ధరలు పెంచినా.. థియేటర్స్ రెంట్ తగ్గకుంటే ఎటువంటి ప్రయోజనమూ ఉండదని, లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని తమ్మారెడ్డి గుర్తు చేశారు.

ఇప్పుడున్న రెంట్ 25 శాతం తగ్గిస్తామని, మూడు సంవత్సరాల వరకు ఈ రేటును పెంచమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారని తమ్మారెడ్డి అన్నారు. అయితే మా వాళ్ల (ఎగ్జిబిటర్స్) నుంచి స్పష్టమైన నమ్మకం కలిగాకే కొత్త జీవోను విడుదల చేయాల్సిందిగా ఆయన కోరారు.

కింది తరగతి సీట్ల నిష్పత్తి సరిగా ఉండడం లేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... మొత్తం సీట్లలో 20 శాతం నేలకు కేటాయించాలన్నరూలుందని, అది చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తమ్మారెడ్డి వెల్లడించారు.
About Writer
SELVI.M