త్వరలో కరీనాను పెళ్లాడుతా: సైఫ్ అలీ ఖాన్
బాలీవుడ్ సినీ తారలు కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్‌ల మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నట్లు వెల్లువెత్తిన గుసగుసలకు తెరపడింది. త్వరలో కరీనాను పెళ్లాడుతానని యంగ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. డిసెంబరులో తన స్వగ్రామమైన పటోడీలోని తన తల్లిదండ్రులను కరీనా కలువనుందని ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం సినీ షెడ్యూల్‌లో ఇద్దరం బిజీబిజీగా ఉన్నామని, అవన్నీ పూర్తయ్యాక వివాహ తేదీని ఖరారు చేస్తామని సైఫ్ వెల్లడించాడు.
ఇదిలా ఉండగా... బాలీవుడ్ హీరోయిన్లు అమిర్తా సింగ్, రోజా కాటలెనోలతో సైఫ్ అలీ ఖాన్‌కు సంబంధమున్నట్లు ఇటీవల వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను సైఫ్ తెగతెంపులు చేసుకుని కరీనా ప్రేమలో పడినట్లు సినీ వర్గాల సమాచారం.
ఏది ఏమైనా... కరీనాను సైఫ్ పెళ్లాడితే సంతోషమే కదా...? ఇంకేముంది... త్వరలో మరో బాలీవుడ్ సినీ జంట వివాహ సంబంధం ద్వారా ఒక్కటవుతుందన్నమాట. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్‌లు ఒక ఇంటివారైనట్లే... త్వరలో కరీనా-సైఫ్‌ల జంట కూడా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని ఆశిద్దామా..?