1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

క్యూట్ అండ్ బ్యూటీ కలర్ బ్లాక్

బ్లాక్ కలర్ నలుపు రంగు చిరంజీవి రజనీకాంత్ గోపీచంద్ అనుష్క ఐశ్వర్యారాయ్
WD
ధవళ వస్త్రాలు శుభానికి సూచిక అన్నారు పెద్దలు. ఆ క్రమంలోనే ఇదివరకు పెళ్లిళ్లకు... పేరంటాళ్లకు వెళ్లేటపుడు తెలుపు రంగు దుస్తులను ధరించి వెళ్లేవారు. అయితే ఆ పరిస్థితి నేడు మారిపోయింది. నలుపు రంగు అంటే ఇష్టపడేవారు ఎక్కువమంది కనుబడుతున్నారు.

ఇటీవల ఫంక్షన్లలో నలుపు దుస్తులు ధరించి వచ్చేవారు తరచు కనబడటం సహజమైపోయింది. అంతెందుకు సెలబ్రిటీల్లో ఎక్కువ మంది బ్లాక్ డ్రెస్‌ల్లోనే కనిపిస్తున్నారు. చివరకు కథానాయికలు సైతం చిన్నచిన్న డ్రెస్‌లను సైతం నలుపు రంగులో ఉన్నవే ధరించి సినీ ఫంక్షన్లకు హాజరవుతున్నారు.

మన మెగాస్టార్ చిరంజీవికి నలుపు దుస్తులంటే ఎక్కువ ఇష్టమట. అందువల్లనే ఆయన వీలున్నప్పుడల్లా బ్లాక్ కలర్ దుస్తులను ధరిస్తుంటారు.

బ్లాక్ డ్రెస్‌లో కేన్స్ ఫెస్టివల్‌కి ఐశ్వర్య


ఆ మధ్య కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్యారాయ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అసలే ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్య... ఆ రోజు బ్లాక్ దుస్తుల్లో మరింత ఆకర్షణీయంగా కనిపించారు. అక్కడికొచ్చినవారంతా ఆమెను చూపులతోనే తినేశారు.

ప్రిన్స్ బ్లాక్ కలర్ టీ-షర్ట్

WD

ఇక టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు పార్టీలకు, ఫంక్షన్లకు నలుపు రంగు దుస్తులనే వేసుకుని వస్తుంటారు. బ్లాక్ కలర్ టీ-షర్ట్స్ ఆయన ఫేవరట్ డ్రెస్ అని చెపుతారు.

నలుపుకున్న ఎట్రాక్షనే వేరు...
ఎన్ని కొత్త రంగులు వచ్చినా... నలుపు రంగుకున్న ఎట్రాక్షనే వేరంటుంది టాలీవుడ్ బ్యూటీ ఇలియానా. అందుకే బ్లాక్ ఈజ్ మై ఫేవరేట్ కలర్ అంటోదామె. ఆమె చెప్పే సంగతులను ప్రక్కన పెడితే... నలుగురి దృష్టిని ఆకర్షించే రంగు మాత్రం బ్లాక్ అని చెప్పవచ్చు.

WD


నలుపు నన్నాకర్షిస్తుంది...
WD


టాలీవుడ్ సెక్సీ బ్యూటీ అనుష్క సెక్సీ కలర్ నలుపేనని చెబుతోంది. ఎవరి దృష్టినో ఆకర్షించే విషయం అటుంచితే తన దృష్టిని మరింతగా ఆకర్షించేది మాత్రం బ్లాక్ కలరేనట. వస్త్ర దుకాణాలకెళితే.... ముందు నలుపు రంగు దుస్తులను కొనేందుకు ఉత్సాహం చూపుతుందట.

బ్లాక్ కలర్ డిజన్స్... గోపీచంద్ స్టైల్
WD

వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళుతున్న యువహీరో గోపీచంద్ ఫేవరెట్ కలర్ బ్లాక్. సినీ ఫంక్షన్లకు ఎక్కువగా ఆయన నలుపు రంగు దుస్తులనే వేసుకొస్తుంటారు. నలుపు దుస్తులపై రకరకాల డిజైన్లతో కూడిన వాటిని ధరిస్తుంటారు.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి