1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

హ్యాపీ బర్త్ డే... టు.. "నాగ చైతన్య"

వినోదం వెండితెర కథనాలు వెండితెర యంగ్ హీరో హ్యాపీ బర్త్ డే టు నాగ చైతన్య మెగాస్టార్ రామ్ చరణ్ తేజ నాగార్జున
వెండితెరపై యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లోకి సినీ తారలు ప్రవేశిస్తున్న నేపథ్యంలో... ఇండస్ట్రీలో పాత నీరు తొలగి పోయి.. కొత్తనీరు వచ్చి చేరుతుంది. ఇందులో భాగంగా, మెగాస్టార్, ప్రరాపా అధినేత చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరుణంలో.. ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ "చిరుత" ద్వారా ఇప్పటికే సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి చేసిన విదితమే.

మరోవైపు అక్కినేని నాగేశ్వర రావు మనుమడు, యువ సామ్రాట్ నాగార్జున కుమారుడు నాగచైతన్య కూడా హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఈ రోజు (నవంబర్-23). నాగ్ నటించి విడుదలకు సిద్ధమైన "కింగ్" చిత్ర ఆడియో రిలీజ్ కార్యక్రమం ఆదివారం జరుగనుంది.

ఈ ఆడియో రిలీజ్ వేదికపై తన కుమారుడైన నాగచైతన్యను... అభిమానుల ముందు యువ సామ్రాట్ పరిచయం చేయబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే నాగ చైతన్య సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమైంది. తొలి షాట్ చిత్రీకరణ నాగ్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే ఆరంభమైంది.

హీరోగా తండ్రిని పోలిన స్టైల్‌తో యువతను ఆకట్టుకునే రీతిలో తెరపైకి రానున్న నాగచైతన్య కోసం అభిమానులు వేయి కనులతో వేచి చూస్తున్నారు. మనం కూడా నాగ చైతన్య సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆశిద్దామా...?
About Writer
SELVI.M