1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

80 శాతం పూర్తయిన "సమర్ధుడు"

వినోదం వెండితెర కథనాలు 80 శాతం సమర్ధుడు కృష్ణం రాజు ప్రధాన పాత్ర  రాజా సంజన బ్యాంకాక్
"కృష్ణం రాజు" ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "సమర్థుడు". అర్జున్ దర్శకత్వంలో ఆకుల సురేష్, ఎం. వెంకటేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ ముగించుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ... ఇందులో ప్రధాన పాత్రలైన కృష్ణంరాజు, రాజాల మధ్య నువ్వా? నేనా? అన్నట్లు కథ సాగుతుందని చెప్పారు.

అవి ఏమిటనేవి తెలియాలంటే చిత్రం విడుదల వరకు వేచి చూడాల్సిందేనని దర్శకుడు వెల్లడించారు. చాలాకాలం తర్వాత కృష్ణంరాజు పౌరుషంతో కూడిన పాత్ర పోషిస్తున్నారని, ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల మద్య జరిగే కథే ఈ చిత్రమని తెలిపారు.

అందులో ఎవరు సమర్థులు అనేదే పాయింట్ అని అర్జున్ అన్నారు. ఇప్పటికే 80 శాతం టాకీ పూర్తయిందని, డిసెంబర్ మొదటి వారంలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సమర్పణ.. వినయ్ రెడ్డి.
About Writer
SELVI.M