1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"లైఫ్‌స్టైల్" లోగో ఆవిష్కరణ

వినోదం వెండితెర కథనాలు లైఫ్స్టైల్ లోగో ఆవిష్కరణ ముప్పలనేని శివ శ్రీ మాధవ్ పట్నాయక్ శ్రీజ
WD

ముప్పలనేని శివ దర్శకుడిగా ఓరుగంటి మధుసూధన రెడ్డి సమర్పణలో శ్రీ మాధవ్ పట్నాయక్ నిర్మిస్తున్న "లైఫ్ స్టైల్" చిత్రం లోగో ఆవిష్కరణ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో డి. రామానాయుడు, మాధవ్ పట్నాయక్, శ్రీజ, ఘటికాచలం, శిశ్చల్, కార్తీక్, అభిరామ్, మీనాక్షిదీక్షిత్, అనన్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లోగోను ఆవిష్కరించిన అనంతరం డా. డి. రామానాయుడు మాట్లాడుతూ... శివ ఏది చేసినా ఓ ప్రణాళిక ప్రకారం చేస్తాడని, ఈ సినిమా స్టిల్స్ చూస్తుంటే యువతరం సినిమాలాగా కన్పిస్తోందన్నారు. ఈ సినిమా సంగీత దర్శకురాలు శ్రీజ తాను చేసిన సీడీని తనకిచ్చిందని, ఆ సీడీని ముప్పలనేని శివకు ఇచ్చానన్నారు. దీంతో ముప్పలనేని శివ ఆమెను సంగీత దర్శకురాలిగా పరిచయం చేశాడని రామానాయుడు చెప్పారు.

నిర్మాత మాధవ్ పట్నాయక్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ముప్పలనేని శివ మాట్లాడుతూ.. ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో చక్కటి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుందన్నారు. ఈ చిత్రాన్ని 60 రోజుల పాటు రామోజీ ఫిలింసిటీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ, బ్యాంకాక్ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించామని చెప్పారు. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తయిందని, డిసెంబరులో చివరి షెడ్యూల్ పూర్తి చేస్తామని శివ వెల్లడించారు.

సంగీత దర్శకురాలు శ్రీజ మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయని, అన్నింటిలోనూ సాహిత్య విలువలున్నాయన్నారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు... ఘటికాచలం, పాటలు... భాస్కరపట్ల, జయసూర్య, కెమేరా.. ప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... ముప్పలనేని శివ.
About Writer
SELVI.M