ఒక్క"రాత్రి"లో ఏం జరిగింది?
|
ఒక్క రాత్రిలో ఎదురైన వింత అనుభవాల సమాహారంతో "రాత్రి" అనే చిత్రం రూపొందుతోంది. అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై ఆర్. కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భానుకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఇంతవరకు కనివిని ఎరుగని పాత్రలో షిండే కన్పిస్తారని చెప్పారు. తన నటనా విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూపించారని, కథ, కథనం వైవిధ్యంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటికే పూర్తయిన మొదటి షెడ్యూల్త్‌తో టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ ముగిసిందని చెప్పారు.
రెండో షెడ్యూల్‌ను కేరళలోని హోగెనకల్ అడవుల్లోనూ, తిరుపతిలోని తలకోన అడవులలోనూ షూట్ చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 28న విడుదల చేయనున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరులో సినిమాను తెరకెక్కించనున్నట్లు కిరణ్ కుమార్ అన్నారు.
ప్రమోద్ కుమార్ సంగీత నిర్వహణలో రూపొందిన మూడు పాటలు కూడా అద్భుతంగా వచ్చాయని దర్శకుడు తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి ఎడిటింగ్... మార్తాండ్ కె. వెంకటేష్, కెమేరా... ఎస్.డి.జాన్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం... భాను కిరణ్.