1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. అంగాంగ ప్రదర్శనకు పోటీ పడుతున్న హీరోయిన్లు!

అంగాంగ ప్రదర్శనకు పోటీ పడుతున్న హీరోయిన్లు!

హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన పోటీ తెలుగు వెండితెర కొత్త చిత్రం యువతీ యువకులు పోటీ నయనతారం సినీరంగం బడ్జెట్ స్టార్ హీరోలు
File FILE
ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి కొత్త చిత్రంలో కొత్త హీరోలు, హీరోయిన్లు వెండితెరకు పరిచయం అవుతున్నారు. మంచి పేరున్న స్టార్ హీరోలు తమ చిత్రాలను బాగా తగ్గించుకోవడంతో కొత్త యువకులతో, తక్కువ బడ్జెట్, విభిన్న కథాంశాలతో కొత్త చిత్రాలు తీసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

దీంతో వెండితెరపై తమ సత్తాను చాటుకునేందుకు నేటితరం యువతీ యువకులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లుగా పరిచయమయ్యే యువతులు టూపీస్ దుస్తుల్లో నటించేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. దీంతో.. ఇప్పటికే కాస్తోకూస్తో నిలదొక్కుకున్న హీరోయిన్లు.. తమ మనుగడను కాపాడుకునేందుకు మరింత దిగజారాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇందులో అగ్రశ్రేణి హీరోయిన్ స్థాయి నుంచి ఐటమ్ సాంగ్‌ల బొమ్మ వరకు ఉన్నారు. ఇందుకు పలు ఉదాహారణలు కూడా చెప్పుకోవచ్చు. హోమ్లీ హీరోయిన్‌గా పేరొందిన నయనతార.. లోగడ వచ్చిన 'సెల్యూట్' చిత్రంలో టూపీస్ దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులకు శృంగార కనువిందు చేసిన విషయం తెల్సిందే. అలాగే..
 
 
పదహారణాల తెలుగు ముద్దుగుమ్మగా చెప్పుకునే సదా, ఛార్మీ, స్నేహలు తమ అందాలను ఆరబోస్తున్నారు.

వీరి కోవలోనే అనుష్క, ఇలియానా, త్రిషా, మీన... ఇలా మంచి పేరున్న హీరోయిన్లు సైతం ఈ కొత్త ఒరవడికి సై అంటున్నారు. దీంతో కొత్తగా వచ్చే చిత్రాల్లో కథకు ప్రాధాన్యత తగ్గి, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనకు దర్శకులు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి చిత్రాలనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారనే వారూ లేకపోలేదు.

ఒక చిత్రంలో ఏమాత్రం మసాలా లేకపోతే.. ఆ చిత్రం ఓపెనింగ్స్ కూడా రావడం లేదని పలువురు నిర్మాతల వాదన. మొత్తం మీద.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా.. హీరోయిన్లు కూడా తమ అందాలను చూపేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదన్నది జగమెరిగిన సత్యం.
About Writer
PNR