1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

''కొంచెం ఇష్టం కొంచెం కష్టం''

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సిద్దార్థ తమన్నా ప్రకాశ్ రాజ్ రమ్యకృష్ణ శ్రీనివాస్ కిషోర్ పార్థశాని
FileFILE
సిద్దార్ధ, తమన్నా హీరోహీరోయిన్‌లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కిషోర్ పార్ధశాని దర్శకత్వంలో రూపొందుతున్న 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శంకర్ ఇషాన్‌లాయ్ స్వరకల్పన చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి 80 శాతం షూటింగ్ పూర్తియింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటిస్తున్న ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ తన బాగా నచ్చిందన్నారు.
తాను ఈ చిత్రం ద్వారా మూడో సారి సిద్దార్థ తండ్రిగా నటిస్తున్నానన్నారు. హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. అన్ని అంశాలను కలగలిపి ఈ చిత్రంలో ఉండేలా రూపొందిస్తున్నామన్నారు. సందేశాన్నిచ్చే చక్కటి వ్యాపార విలువలు కలిగిన చిత్రంగా ఇది మిగిలిపోతుందన్నారు. ఈ చిత్రానికి సంగీతం కూడా ఎస్సెట్ లాంటిదన్నారు. ఈ చిత్రంలో ఇంకా కరుణ, సామ్రాట్, నాజర్, బ్రహ్మానందం, వేణుమాధవ్, సుధ తదితరులు నటిస్తున్నారు.
About Writer
Hanumantha Reddy