మాళవికకు అబ్బాయి పుట్టాడు...
"చాలా బాగుంది" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ మాళవిక. హీరోయిన్‌గా ముద్రవేసుకున్న మాళవిక అనంతరం ఐటమ్‌సాంగ్‌లలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లోనూ మాళవిక తాజాగా చేసిన ఐటమ్‌సాంగ్‌లు బంపర్ హిట్ అయ్యాయి.
హీరోయిన్‌గా, ఐటమ్‌గేర్ల్‌గా తన హవాను కొనసాగిస్తున్న మాళవికకు అబ్బాయి పుట్టాడట. ముంబై నగరంలోని ఓ ఆస్పత్రిలో మాళవికకు బాబు పుట్టాడని, తల్లి, పుత్రుడు సుఖంగా ఉన్నారని ఆమె భర్త సురేష్ మీడియాతో వెల్లడించారు.
ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, వడ్డేనవీన్‌లతో "చాలా బాగుంది" చిత్రంలో నటించిన మాళవిక, ఆ తర్వాత "అప్పారావు డ్రైవింగ్ స్కూలు", "ప్రియ నేస్తమా", "సుందరాంగుడు" వంటి తదితర తెలుగు సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లోనూ అగ్రహీరోల సరసన నటించిన మాళవికకు, గత ఏడాది బెంగళూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.