1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ఆజారా... ఆజారా.." అంటున్న ముమైత్!

వినోదం వెండితెర కథనాలు ఆజారా ఆజారా ముమైత్ ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వం రాజీవ్ కనకాల
WD

హిట్ చిత్రాల దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నృత్యతార ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రధారిణిగా, రాజీవ్ కనకాల హీరోగా జి. మహేశ్వర రెడ్డి (సాయిరెడ్డి) సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "పున్నమినాగు".

యువ నిర్మాత జి. విజయ్ కుమార్ గౌడ్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్న ఈ క్రేజీ మూవీ... బ్యాంకాక్‌లో పాటలను చిత్రీకరించుకుంది. కాగా.. బ్యాంకాక్‌లోని పటాయ్ ఐలాండ్‌లో "రగులుతోంది మొగలి పొద" అంటూ సాగిన పాటను ముమైత్ ఖాన్, రాజీవ్ కనకాల, సుహాసినిలపై అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో నవంబర్ 11 నుంచి 14 వరకు చిత్రీకరించారు.

"ఆజారా... ఆజారా.. లైఫంటే.. థ్రిల్లేరా" అంటూ సాగిన మరో పాటను ముమైత్ ఖాన్ మరియు డ్యానర్స్‌లపై నవంబర్ 15 నుంచి 17 వరకు బ్యాంకాక్ సిటీ రోడ్స్‌పైన తీశామని దర్శకుడు వెల్లడించారు. పై పాటను కూడా అమ్మరాజశేఖర్ నృత్య దర్శకత్వాన చిత్రీకరించామని ఆయన చెప్పారు. "పున్నమినాగు" తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే సంపూర్ణమైన నమ్మకముందని కోదండరామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ముమైత్‌ఖాన్‌కు నటిగా ఈ చిత్రం మంచి పేరును సాధించి పెడుతుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జి. విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో రెండు పాటల్ని చిత్రీకరించడంతో చిత్రం మొత్తం పూర్తయిందన్నారు. ప్రస్తుతం లండన్‌లో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుందని విజయ్ కుమార్ వెల్లడించారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా తీస్తున్నారని... ఈ సినిమా దర్శకుడికి మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ రెండోవారంలో ఆడియోను, అదే నెలలో సినిమాను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

ముమైత్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఎం.ఎస్. నారాయణ, నళిని, వినోద్ కుమార్, నిళల్‌గల్ రవి, లోచన్, సారిక రామచంద్రారావు, ఆదిత్య ఓం తదితరులు నటిస్తున్నారు.

యండమూరి వీరేంద్రనాథ్ సమకూర్చిన ఈ చిత్ర కథకు వెలిగొండ శ్రీనివాస్ సంభాషణలను అందించారు. ఛాయాగ్రహణం... పి.ఎస్. బాబు, స్క్రీన్‌ప్లే... స్వామిజీ, సంగీతం... ఎస్.ఎ. రాజ్ కుమార్, ఎడిటింగ్... నందమూరి హరి.
About Writer
SELVI.M