1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"సూర్య s/o కృష్ణన్‌"పై ప్రశంసల జల్లు

వినోదం వెండితెర కథనాలు సూర్య so కృష్ణన్ ప్రశంసలు జల్లు ఆస్కార్ ఫిలింస్ బేనర్ గజిని సూర్య
"గజిని" సూర్య ద్విపాత్రాభినయంతో ఆస్కార్ ఫిలింస్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వి.రవిచంద్రన్ నిర్మించిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో 550 ప్రింట్లతో విడుదలై ఎక్స్‌ట్రార్డనరీ ఓపెనింగ్స్‌తో అన్ని సెంటర్స్‌లో అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో పాటు యూత్‌ని ఆకట్టుకునే చక్కని లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, దశరథ‌‌లు తమకు కలిగిన అనుభూతిని తెలియజేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు,

ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎస్.వి.ఆర్. మీడియా ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో... భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఆస్కార్ ఫిలింస్ బేనర్‌లో సినిమాలు వస్తోందంటే.. ఆడియన్స్ మధ్య చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయన్నారు.

సూర్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన "కాక కాక" ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ బాగా తెలుసునని, అదే కాంబినేషన్‌లో నిర్మించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడాలని చెప్పారు. సబ్జెక్ట్ సైడ్‌గానీ, టెక్నికల్ సైడ్‌గానీ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా ఉందని, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చాలా చక్కగా పండిందన్నారు.

16 సంవత్సరాల యువకుడు నుంచి 60 సంవత్సరాల వృద్ధుడి వరకు సూర్య చూపించిన వేరియేషన్స్ ఎక్స్‌లెంట్ అని కొనియాడారు. ఎంతో ఎఫెర్ట్ పెట్టి సూర్య ఆ క్యారెక్టర్లు చేశారు కాబట్టే సినిమా ఘనవిజయం సాధించిందని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇలాంటి ప్లెజెంట్ మూవీస్ తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కావడం, అందర్నీ ఆకట్టుకోవడం చాలా ఆనందం కలిగించిందని భీమనేని తెలిపారు.

దశరథ్ మాట్లాడుతూ... డిఫరెంట్ సినిమా చూడాలనుకునే ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన మంచి సినిమా "సూర్య సన్నాఫ్ కృష్ణన్" అని, ఆటోబయోగ్రఫీ మూవీగా చాలా ఫ్రెష్ ఫీల్‌ను కలిగించే ఈ సినిమాలో టెక్నికల్‌గా అన్ని క్రాఫ్ట్స్ చాలా జెన్యూన్‌గా వర్స్ చేశారని ప్రశంసించారు.

ఘర్షణ, రాఘవన్ వంటి విభిన్న చిత్రాలు రూపొందించిన గౌతమ్ మీనన్‌కు తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుందన్నారు. "గజిని" తర్వాత సూర్య ఈ చిత్రంలో రెండు డిఫరెండ్ క్యారెక్టర్స్ చేశారని, అయితే సౌత్ ఇండియాలోనే మొదటి సారి యువకుడిగా, వృద్ధుడుగా మేకప్‌తో కాకుండా నేచురల్‌గా తన బాడీని మలుచుకుని ఎంతో కష్టపడిన సూర్యను అన్ని వర్గాల ప్రేక్షకులు అభినందిస్తున్నారని దశరథ్ వెల్లడించారు. ఈ చిత్రంలోని ప్రతి ఒక్క సన్నివేశమూ అద్భుతంగా ఉందని ఆయన అన్నారు.
About Writer
SELVI.M